43 శాతం మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు

43 percent of the members have criminal charges against them - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 43 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 28 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫారŠమ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) నివేదిక ఈ మేరకు పేర్కొంది. దేశవ్యాప్తంగా 4,809 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు గాను 4,759 మంది ఎన్నికల అఫిడవిట్లను నివేదిక పరిశీలించింది.

క్రిమినల్‌ కేసుల్లో కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియా కోజ్‌ తొలిస్థానంలో ఉన్నారు. ఆయనపై 37 తీవ్రమైన క్రిమినల్‌ కేసులతో పాటు మొత్తం 204 కేసులున్నాయి. 37 తీవ్రమైన కేసులతో పాటు మొత్తం 64 కేసులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదో స్థానంలో ఉన్నారు. సంపన్న ప్రజాప్రతినిధుల జాబితాలో టీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి రూ.5,300 కోట్లతో తొలి స్థానంలో, వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రూ.2577 కోట్లతో రెండో స్థానంలో, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రూ.668 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top