ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

Published Mon, May 20 2024 4:58 PM

17 Killed In Chattisgarh Road Accident

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం(మే20) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావర్ధాలో ప్యాసింజర్‌ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో  వాహనంలో ప్రయాణిస్తున్న 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 

వాహనం 20 అడుగుల లోయలో పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువైంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు వాహనంలో 25 నుంచి 30 మంది దాకా ప్రయాణిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement