కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మంగళవారం జిల్లాలోని
శివాలయాలు భక్తులతో
కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు,
అర్చనలు నిర్వహించారు. సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో
ఆలయాలకు చేరుకొని ఉసిరిచెట్లు, తులసి కోటలు, ఆలయ ప్రాంగణాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. కృష్ణా, భీమా నదుల్లో పుణ్యస్నానాలు
ఆచరించి దీపారాధనలు
నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని
శివాలయంలో న్యాయమూర్తి
వింధ్యానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివుడిని
దర్శించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు, దీపారాధన చేశారు. – నారాయణపేట


