మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Nov 25 2026 4:06 AM | Updated on Nov 25 2026 4:06 AM

ధన్వాడ: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఎమ్నోనిపల్లిలో ఉపాధి నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సమాఖ్య భవనం, నాలు గు ఇందిరమ్మ ఇళ్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడకుండా మహిళా సమాఖ్య భవనాలు మంజూరు చేయించామన్నారు. అన్ని గ్రామాల్లో దశల వారీగా భవనాలు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని, ఇప్పుడు ప్రతి ఇంటికి ఇందిరమ్మ కుటుంబ బీమా తీసుకొచ్చి ఆర్థిక భరోసానిస్తుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగేష్‌, పీసీసీ సభ్యుడు చిట్టెం సాయి అభిజయ్‌రెడ్డి, విండో మాజీ అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కిష్టాపూర్‌ సర్పంచ్‌ కొండయ్య, ఉపసర్పంచ్‌ సిద్దప్ప, నాయకులు నరహరి, సచిన్‌, పూజారి నర్సింహులు, రాఘవేందర్‌రెడ్డి, అయ్యపురెడ్డి, నరేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీవీఆర్‌ భవన్‌లో ప్రత్యేక పూజలు..

నారాయణపేట: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని సీవీఆర్‌ భవన్‌లో ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, విశ్వజిత్‌రెడ్డి దంపతులు గణపతి హోమం, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తికి ప్రతీకగా నిలిచేది పవిత్ర కార్తిక మాసమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవడంతో పాటు ధర్మమార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకుసాగాలని ప్రార్థించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement