–8లో u
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళలు పుర పరిధిలోని 10, 16వ వార్డుకు చెందిన వారు. ఆయా వార్డుల్లో మహిళల కోసం గతంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. నాలుగు నెలలుగా బోరుమోటారు పని చేయకపోవడంతో నీటి సరఫరా నిలిచి నిరూపయోగంగా మారాయి. దుర్వాసనతో ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 1వ తేదీన మహిళలు పుర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు.’
కోస్గి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాఖా కోస్గి పుర పరిధిలో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకోని పుర అధికారులు, కొందరు నాయకులు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌తో కుమ్మకై ్క ప్రభుత్వ బోర్ల నుంచి రోడ్డు పనుల కోసం రోజు ఆరు ట్యాంకర్ల నీటిని తరలించేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనధికార అనుమతులతో కాంట్రాక్టర్ నిత్యం ప్రభుత్వ బోర్ల నుంచి నీటిని అక్రమంగా తోడేస్తున్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వ నీటి వనరులు ప్రజల అవసరాలకు వినియోగించాల్సి ఉండగా.. స్థానిక అధికారులు, కొందరు నాయకులు మాత్రం ప్రైవేట్ సంస్థల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఇష్టారీతిన వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అనుమతి ఉందంటున్న కాంట్రాక్టర్..
చేపల మార్కెట్ సమీపం, మున్నూర్‌వీధి దొరోళ్ల ఇంటి దగ్గర ఉన్న ప్రభుత్వ బోర్ల నుంచి రోజు ఆరు ట్యాంకర్ల నీటిని ప్రైవేట్ పనులకు ప్రభుత్వ బోర్ల నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. కాలనీవాసులు ఎవరైనా అడిగితే అభివృద్ధి పనుల కోసం నీటిని తీసుకెళ్తున్నామని, పుర అనుమతి ఉందంటూ దబాయిస్తున్నారు. చేపల మార్కెట్ నుంచి ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న విషయాన్ని కాంట్రాక్టర్ వద్ద వాకాబు చేయగా ఆరు ట్యాంకర్లకు అనుమతి ఉందంటూ ట్రాక్టర్ నంబర్లతో సహా చూపించడం శోచనీయం. పట్టపగలే నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న జలదోపిడీపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి పూర్తి స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
కోస్గిలో అభివృద్ధి పనులకు పుర మోటార్ల నుంచి నీటి తరలింపు
అధికారులు, కొందరు నాయకుల
అండతో అక్రమంగా..
అనుమతులు ఉన్నాయంటూ
నిత్యం ఆరు ట్యాంకర్లతో..
అధికారుల పొంతన లేని సమాధానాలు


