తెల్లకంది క్వింటా రూ.10,989 | - | Sakshi
Sakshi News home page

తెల్లకంది క్వింటా రూ.10,989

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం తెల్ల కంది క్వింటా గరిష్టంగా రూ.10,989, కనిష్టంగా రూ.10,900 ధర పలికాయి. అదేవిధంగా ఎర్ర కంది గరిష్టంగా రూ.10,906, కనిష్టంగా రూ.10,309, వరి (1010) గరిష్టంగా రూ.2,360, కనిష్టంగా రూ. 2,350, వరి (బీపీటీ) సరాసరిగా రూ.3,050, వరి (కేఎన్‌ఎం) గరిష్టంగా రూ.3,226, కనిష్టంగా రూ.3,030, వరి (ఆర్‌ఎన్‌ఆర్‌) గరిష్టంగా రూ.4,033, కనిష్టంగా రూ.2,800 ధరలు లభించాయి.

ఉద్రిక్తతకు దారితీసిన ఏబీవీపీ రాస్తారోకో

మరికల్‌: మండలంలోని తీలేరు ప్రాథమిక పాఠశాల ప్రహరీ కూలి గాయాలపాలైన ఇద్దరు విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏబీవీపీ మండల కన్వీనర్‌ బన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మరికల్‌ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకో నిర్వహించారు. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై రాస్తారోకో ఎలా చేస్తారని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయాలని యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాస్తారోకో కొనసాగిస్తూ అధికారులు, పాలకులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. సీఐ భగవంత్‌రెడ్డి, ఎస్‌ఐ రాంలాల్‌నాయక్‌ ఏబీవీపీ నాయకులతో మాట్లాడి అధికారులకు దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

సైక్లింగ్‌లో సత్తాచాటిన నర్వ విద్యార్థులు

మక్తల్‌: హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 16, 17న జరిగిన అస్మిత్‌ ఖేలోఇండియా ఉమెన్స్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ సౌత్‌జోన్‌ జాతీయస్థాయి పోటీల్లో నర్వ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు సైక్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి గోపాలం గురువారం తెలిపారు. పోటీల్లో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 11 మంది బాలికలు పాల్గొన్నారన్నారు. గురువారం తహసీల్దార్‌ మల్లారెడ్డి, విశ్రాంత పీఈటీ గోపాలం, జీహెచ్‌ఎం సునీత సర్టిఫికెట్స్‌, పతకాలు అందజేశారు. విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన పీడీ స్వరూపను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

జిల్లా సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు సిద్ధం కావాలి

నారాయణపేట: విద్యార్థుల్లోని శాసీ్త్రయ దృక్పతం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నెలాఖరు లేదా డిసెంబర్‌ మొదటి వారంలో జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ ప్రదర్శన, పీఎంశ్రీ సైన్స్‌ ఎగ్జిబిషన్‌, తెలంగాణ ప్యూచర్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ విభాగాల్లో నిర్వి హస్తామని.. ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకుల, కేజీబీవీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నుంచి కచ్చితంగా ప్రాజెక్ట్‌లు ఉండే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌ (సెల్‌నంబర్‌ 94401 67947) సంప్రదించాలని సూచించారు.

ఉత్సాహంగా

బ్యాడ్మింటన్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో గురువారం అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లా బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు నిర్వహించారు. సంగారెడ్డిలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్‌, జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.రవికుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement