పకడ్బందీగా ఇందిరమ్మ జీవిత బీమా | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఇందిరమ్మ జీవిత బీమా

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

నారాయణపేట: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 18 నుంచి 59 ఏళ్లలోపు కుటుంబ సభ్యులను రేషన్‌కార్డు ఆధారంగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తులను స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ నెల 30 వరకు చేపట్టనున్న తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, జిల్లా అధికారులు, పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement