నెల కిందట కాంట్రాక్టర్ పుర పరిధిలో వేసిన సీసీ రోడ్ల క్యూరింగ్‌కు నీరు కావాలని అడిగితే కొన్నిరోజుల కోసం బోరునీ రు వాడుకోవాలని చె ప్పాం. అధికారికంగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఫిర్యాదులు రావడంతో రెండ్రోజు ల కిందట నీటి సరఫరా నిలిపివేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. ఏఈతో మాట్లాడి వెంటనే నీటి సరఫరాను నిలిపి వేయిస్తాం.
– నాగరాజు, పుర కమిషనర్, కోస్గి
ఆరు నెలల కిందట అభివృద్ధి పనుల కోసం సంబంధిత కాంట్రాక్టర్ అడిగితే కమిషనర్, చైర్మన్‌తో మాట్లాడి మున్సిపల్ బోర్ల నుంచి నీరు ఇవ్వాల్సి వచ్చింది. ట్యాంకర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం నీటి సమస్యలు తలెత్తడంతో నిలిపివేయాలని సిబ్బందితో చెప్పించినా కాంట్రాక్టర్ వినడం లేదు. బోర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి తాళాలు వేయించి ప్రైవేట్ నీటి సరఫరాను ఆపేస్తాం.
– జ్ఞానేశ్వర్‌రెడ్డి, పుర ఏఈ, కోస్గి
●


