విత్తనోత్పత్తితో అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తితో అదనపు ఆదాయం

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

మాగనూరు: వరి విత్తనోత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంపొందించుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే) నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ అన్నారు. గురువారం మాగనూరు మండలం కొత్తపల్లిలో టీఆర్‌వీకే ఆధ్వర్యంలో వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించగా.. ఆయన హాజరై నాణ్యమైన విత్తనాల తయారీలో పాటించాల్సిన సాగు పద్ధతులు, పంట నిర్వహణ, విత్తనోత్పత్తి ప్రాముఖ్యత, రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. విత్తనోత్పత్తిలో శాసీ్త్రయ పద్ధతులు పాటించడంతో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. గ్రామానికి చెందిన రైతు బాల్‌రెడ్డి మూడు ఎకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం వరి విత్తనోత్పత్తి చేసి తన అనుభవాలను పంచుకున్నారు. ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ, తెగుళ్ల నియంత్రణకు టీఆర్‌వీకే సమన్వయకర్త తగిన సూచనలు, సలహాలు అందించారని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంతో విత్తనోత్పత్తిని సమర్థవంతంగా చేపట్టగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సందర్శించి పంట పరిస్థితిని పరిశీలించారు. విత్తనోత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో నాబార్డ్‌ డీడీఎం మహేందర్‌, మాగనూరు వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్‌, ఏఈఓ అపర్ణ, మాగనూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement