చేయూతకు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

చేయూతకు గ్రీన్‌సిగ్నల్‌

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

అధికారులతో ప్రత్యేక సమావేశం..

మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు

నారాయణపేట: ప్రభుత్వం దీపావళి కానుకగా కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక దిశా నిర్దేశంతో డీఆర్డీఓ వెంకట్రాములు సూచనల మేరకు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేసేందుకు జిల్లాలో ప్రక్రియ వేగవంతమైంది. జిల్లావ్యాప్తంగా కొత్త పింఛన్లకు 10,956 దరఖాస్తులు రాగా.. అధికారుల పరిశీలన అనంతరం 7,559 దరఖాస్తులకు ఆమోదం లభించింది. మరో 3,397 దరఖాస్తులు ఆమోదం పొందాల్సి ఉంది. వితంతువులు, ఒంటరి మహిళల విభాగాల్లో అధికసంఖ్యలో దరఖాస్తులు ఆమోదం పొందగా.. దివ్యాంగుల విభాగంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తం 3,498 మంది దివ్యాంగులు దర ఖాస్తు చేసుకోగా.. కేవలం 800 మందికి మాత్రమే ఆమోదం లభించింది. అంటే దాదాపు 23 శాతం దరఖాస్తులకే గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. సదరం ధ్రువపత్రాల గడువు ముగియడం, పునరుద్ధరణ ప్రక్రియలో జాప్యం, వైకల్య శాతం నిర్ధారణ వంటి అంశాలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ధ్రువపత్రాలు అందని పలువురి దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత మరోసారి పరిశీలించి అర్హత ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

వితంతువుల్లో 94 శాతం ఆమోదం..

వితంతు దరఖాస్తులు 5,493 రాగా.. వాటిలో 5,166 దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలిపారు. అంటే 94 శాతానికిపైగా ఆమోదం లభించింది. ఒంటరి మహిళల విభాగంలో 1,432 దరఖాస్తులు రాగా.. 1,394 ఆమోదం పొందాయి. ఈ రెండు విభాగాల్లోనూ అధిక శాతం దరఖాస్తులకు ఆమోదం లభించడం విశేషం.

చేనేత, గీత కార్మికుల పరిస్థితి..

చేనేత కార్మికుల విభాగంలో 334 మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 53 మందికి మాత్రమే ఆమోదం లభించింది. అలాగే గీత కార్మికుల విభాగంలో 199 దరఖాస్తులు రాగా.. 146 మందికి పింఛన్ల మంజూరుకు ఆమోదం లభించింది. ఆయా విభాగాల్లో అర్హతల ఆధారంగా అధికారులు పరిశీలన చేపట్టారు. కొత్తగా ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు గురువారం నుంచి 18వ తేదీ వరకు ప్రొసీడింగ్స్‌ పంపిణీ చేయనున్నారు. 19, 20 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛనన్‌ సొమ్ము జమ చేసే అవకాశం ఉంది.

సీఎం ఇలాఖాలో..

కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, గుండుమాల్‌, మద్దూర్‌, కొత్తపల్లి మండలాలతో పాటు మద్దూర్‌, కోస్గి మున్సిపాలిటీల్లో 12వ తేదీ నుంచి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేసేందుకు అధికారులు సన్నా హాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి వాకిటి శ్రీహ రి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్‌ నియోజకవర్గంతో పాటు నారాయణపేట నియోజకవర్గంలోనూ పంపిణీ కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేటలో ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేసేందుకు అధికారులు షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారు.

చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాస్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల అధికారులతో సమావేశమై పంపిణీ విధానం, లబ్ధిదారుల జాబితాలు, కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. నిర్ణీత గడువులోగా అర్హులందరికీ ప్రొసీడింగ్స్‌ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్నారు. ఎన్నాళ్లుగానో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రొసీడింగ్స్‌ పంపిణీ పూర్తయిన అనంతరం నగదును 19వ తేదీ నుంచి ఖాతాల్లో జమ చేస్తారన్న దానిపై లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 10,956 దరఖాస్తులు.. 7,559 ఆమోదం

దివ్యాంగుల దరఖాస్తుల్లో భారీగా కోత

ప్రొసీడింగ్స్‌ సిద్ధం చేస్తున్న అధికారులు

నేటి నుంచి పంపిణీకి శ్రీకారం

మండలం దరఖాస్తులు వితంతువులు ఒంటరి దివ్యాంగులు చేనేత గీత

మహిళలు కార్మికులు కార్మికులు

దామరగిద్ద 1,021 539 166 311 1 4

ధన్వాడ 715 341 81 244 34 15

గుండుమాల్‌ 377 169 64 129 – 15

కోస్గి 429 222 64 110 23 10

కొత్తపల్లి 363 144 37 181 – 1

కృష్ణా 670 419 85 165 – 1

మద్దూరు 542 227 69 238 1 7

మాగనూరు 453 279 49 107 – 18

మక్తల్‌ 1,060 506 130 406 – 18

మరికల్‌ 572 305 68 186 – 13

నారాయణపేట 1,261 620 194 391 37 19

నర్వ 596 325 61 186 – 24

ఊట్కూర్‌ 1,004 528 141 316 4 15

పురపాలికల వారీగా..

నారాయణపేట 852 377 90 150 216 19

కోస్గి 379 208 42 98 14 17

మక్తల్‌ 413 173 63 172 2 3

మద్దూరు 249 111 28 108 2 –

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement