ఆజాద్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆజాద్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

నారాయణపేట: భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌ హాజరై ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. భారత విద్యావ్యవస్థ బలోపేతం, విద్యావకాశాల విస్తరణకు ఆజాద్‌ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యతోనే వ్యక్తి వికాసం, సమాజ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, మతసామరస్యం, సమానత్వం వంటి ఉన్నత విలువల పరిరక్షణకు ఆజాద్‌ చేసిన కృషి నేటితరానికి ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్న ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విద్య ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ విద్యారంగ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్‌, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్‌, మైనార్టీ సంక్షేమశాఖ సిబ్బంది రషీద్‌, షమీమ్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల ఐక్యతే బలం

కోస్గి రూరల్‌: ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలను పరిష్కరించడమే ల క్ష్యమని కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయి స్‌ యూనియన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మహదేవ్‌, జిల్లా అధ్యక్షుడు మోనప్ప అన్నారు. బుధవారం గుండుమాల్‌లోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో సంఘం మండల కార్యవర్గ ఎన్నికకు వారు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లా డారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడతామన్నారు. హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 17న చేపట్టనున్న సామూహిక నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్‌రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement