కాంగ్రెస్‌ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటం

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

నారాయణపేట: బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేస్తేనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షనన్‌ హాల్‌లో బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశానికి ఆమెతో పాటు పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మధుకర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతంరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించేలా పనిచేయాలని.. ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కేంద్ర నిధులే కీలకమని, వచ్చిన ప్రతి పైసా వివరాలను తెలియజేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలు కేంద్ర పథకాలపై ప్రచారం చేయకపోవడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని.. ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనను చూశారని, బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచే సంస్థాగతంగా సిద్ధం కావాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మధుకర్‌ ఇచ్చే సలహాలు, సూచనలతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement