కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా
రెండో రోజు బుధవారం పద్మావతి సమేత కురుమూర్తి రాయుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అవాహిత దేవతా పూజలు, హోమ కార్యక్రమాలు
శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి స్వామివారిని హంస వాహనంపై ఊరేగించగా.. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల కోలాహలం మధ్య హంస వాహన సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, ఆలయ చైర్మన్ బత్తుల బాల్రాజు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట


