దక్షిణమధ్య రైల్వే డీఆర్‌ఎం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

దక్షిణమధ్య రైల్వే డీఆర్‌ఎం తనిఖీ

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

మక్తల్‌: రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్ల పొడగింపునకుగాను బుధవారం దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం సంతోష్‌కుమార్‌వర్మ పర్యటించారు. ఉదయం 9 గంటలకు మహబూబ్‌నగర్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన ఆయన మార్గమధ్యంలోని మరికల్‌, జక్లేర్‌, మక్తల్‌, మాగనూర్‌ స్టేషన్లను తనిఖీ చేశారు. రైలు సౌకర్యం కల్పించి మూడేళ్లు కావడంతో పట్టాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతికి వెళ్లాలంటే రాయిచూర్‌కు వెళ్లాల్సి వస్తోందని.. ఇక్కడి నుంచి నడపాలని మక్తల్‌లో పలువురు కోరారు. మూడేళ్లుగా కేవలం ప్యాసింజర్‌ రైలు ఒక్కటి మాత్రమే నడుస్తోందని.. హైదరాబాద్‌ నుంచి రాయిచూర్‌ వరకు రోజు ఉదయం, మధ్యాహ్నం నడిపేలా చూడాలన్నారు. వినతుల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయన వెంట ఉద్యమకారుడు రామలింగం, రైల్వే సిబ్బంది ఉన్నారు.

డెమో సమయపాలన మార్చాలని వినతి..

మాగనూర్‌: రాయిచూర్‌–హైదరాబాద్‌ డెమో రైలు సమయపాలన మార్చాలని గ్రామస్తులు డీఆర్‌ఎం సంతోశ్‌కుమార్‌వర్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. బుధవారం మాగనూర్‌ రైల్వేస్టేషన్‌ను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. స్టేషన్‌లోని మౌలిక వసతులు పరిశీలించి అవసరం మేర తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. డెమో రైలు సమయపాలన మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాగనూర్‌లో నిలిపే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement