నారాయణపేట ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ నిర్దేశించిన అకాడమిక్ ప్యానల్ ఇన్‌స్పెక్షన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పాఠశాలల విద్యా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన 12 మంది అకాడమిక్ ప్యానల్ ఇన్‌స్పెక్షన్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్యానల్ సభ్యులు తమ పాఠశాల సందర్శన నివేదికలు, పర్యవేక్షణ, డైరీలు, కాంప్లెక్స్ సమావేశాల పరిశీలన ప్రొఫార్మాతో సమావేశానికి హాజరై వివరాలు సమర్పించాలని సూచించారు. తరగతి పరిశీలన, విద్యార్థుల అభ్యసనస్ధాయిలు, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల అమలు, ఉపాధ్యాయులకు అకాడమిక్ గైడెన్స్, రికార్డుల పరిశీలన, అకాడమిక్ గైడెన్స్ రిజిస్టరు, కాంప్లెక్స్ సమావేశాల పర్యవేక్షణ, నివేదికల సమర్పణ తదితర అంశాలు పరిశీలించాలన్నారు.


