● పాల్గొన్న అండర్–19 ఉమ్మడి జిల్లాల జట్లు
● శుభారంభం చేసిన మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో 70వ స్కూల్ గేమ్స ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీలో తెలంగాణ రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. మొదటి రోజు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం, నగర శివారులోని (అల్లీపూర్ సమీపం) క్రికెట్ మైదానంలో లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. నగర శివారులోని మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అతిథ్య మహబూబ్‌నగర్ శుభారంభం చేసింది. 20 పరుగుల తేడాతో వరంగల్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. జిల్లా బౌలర్ జశ్వంత్ 2 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 15 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ కాగా.. ఖమ్మం 100 పరుగులకే కుప్పకూలింది.
● ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మెదక్ 122 పరుగుల తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ నిర్ణీత 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి 180 పరుగులు చేసింది. జట్టులో చేతన్ నిఖిల్ 96 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ 58 పరుగులకు ఆలౌట్ అయింది. షాహిద్, కార్తీక్ ఐదేసి వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్ 7 వికెట్ల తేడాతో కరీంనగర్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.


