నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరువులో వినాయకుడి నిమజ్జనం
నారాయణపేట: గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ డా. వినీత్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు స్వయంగా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శించిన ఆయన.. పోలీసు బందోబస్తు, ప్రజల రద్దీ, శోభాయాత్ర మార్గం, నిమజ్జన ప్రదేశంలో చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించారు. చెరువు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని దేశించారు.మెయినన్‌చౌక్‌లో డ్రోన్ ద్వారా గణేష్ శోభాయాత్రను ఎస్పీ స్వయంగా వీక్షించారు. సరాఫ్‌బజార్‌లో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం తాగినట్లు గుర్తించిన టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అతడిని ఇంటికి పంపించి స్వయంగా నడుపుతూ సురక్షితంగా తీసుకెళ్లారు.


