మండలాల వారీగా ఏజీఎల్‌ సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

మండలాల వారీగా ఏజీఎల్‌ సర్వీసులు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

మండలాల వారీగా ఏజీఎల్‌ సర్వీసులు

నారాయణపేట: జిల్లాలో సుమారు 1.15 లక్షల ఎకరాల వరి సాగు బోరుబావులపైనే ఆధారపడి ఉంది. మోటార్లతో నీటి తరలింపునకు విద్యుత్‌ సరఫరా అత్యంత కీలకంగా మారింది. విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారడం.. భూగర్భ జలమట్టం తగ్గుతుండటంతో పంటలకు సరిపడా సాగునీరు అందక ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గతేడాది సుమారు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ ఏడాది సుమారు 1.40 లక్షలకు తగ్గింది.

విద్యుత్‌ హెచ్చుతగ్గులతో..

విద్యుత్‌ కోతలతో పాటు సరఫరాలో హెచ్చుతగ్గు ల తో బోరుమోటార్లు కాలిపోతున్నాయని.. అదన పు మరమ్మతు ఖర్చులు భరించాల్సి వస్తోందని రై తు లు వాపోతున్నారు. ఓ వైపు విద్యుత్‌ సరఫరాకు ఎ దురుచూపులు..మరోవైపు మోటారు కాలిపోతే మ రమ్మతు, పంటకు నీరు అందక దిగుబడి తగ్గుతుందనే భయంతో రైతులు విలవిలలాడుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని 55 సబ్‌స్టేషన్ల పరిధిలో వ్యవసాయం, గ్రామీణ, పట్టణ, వాటర్‌ వర్క్స్‌, ఇండస్ట్రియల్‌, 24 గంటల ఫీడర్లు ఉన్నట్లు అందుబాటులో ఉన్న ఫీడర్‌ జాబితా సూచిస్తోంది. అయినా వ్యవసాయానికి ని రంతర, స్థిరమైన సరఫరా విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ కో తల తర్వాత ఒక్కసారిగా వచ్చే హెచ్చుతగ్గులు మో టార్లకు ముప్పుగా మారుతోందని రైతులు చె బుతు న్నారు. కోస్గి నుంచి మద్దూరు, మక్తల్‌ నుంచి ఊ ట్కూర్‌, మాగనూర్‌ నుంచి కృష్ణా, నర్వ నుంచి దా మరగిద్ద, మరికల్‌ నుంచి ధన్వాడ వరకు విద్యు త్‌ నెట్‌వర్క్‌ విస్తరించి ఉంది. జిల్లాలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్లు కోస్గి, సర్జాఖాన్‌పేట, మిర్జాపూర్‌, చంద్రవంచ, మద్దూరు, దోరేపల్లి, మొమిన్‌పూర్‌, గుండుమా ల్‌, అమ్లికుంట, వీరారం, కొత్తపల్లి, గోకుల్‌నగర్‌, మ క్తల్‌, జక్లేర్‌, పస్పుల, ముస్టిపల్లి, మంతనన్‌గోడ్‌, లింగంపల్లి, కర్నె, గుడిగండ్ల, ఉట్కూర్‌, బిజ్వార్‌, నిడుగుర్తి, ఓబ్లాపూర్‌, మాగనూర్‌, తంగడి, నేరెడుగాం, గుడెబల్లూరు, కొల్పూర్‌, కృష్ణా, నర్వ, పెద్దకడ్మూర్‌, నా రాయణపేట, కనుకుర్తి, మొగల్‌మడ్క, దామరగిద్ద, క్యాతన్‌పల్లి, లోకుర్తి, విఠలాపూర్‌, మ రికల్‌, అప్పంపల్లి, వెంకటాపూర్‌, ఎక్లాస్‌పూర్‌, కన్మనూర్‌, సింగా రం, కోటకొండ, చిన్నజట్రం, పేరపళ్ల, అప్పక్‌పల్లి, కొల్లంపల్లి, ధన్వాడ, కొండాపూర్‌, గో టూర్‌, గున్ముక్ల తదితర సబ్‌స్టేషన్ల పరిధిలో ఫీడర్లు ఉన్నాయి.

మాగనూర్‌ శివారులో ఎండుతున్న వరి పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement