కాళోజీ ఆశయాల సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాళోజీ ఆశయాల సాధనకు కృషి చేయాలి

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

షెడ్‌ నిర్మాణానికి భూమి పూజ..

మక్తల్‌: కాళోజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ కోరారు. బుధవారం పట్టణంలోని జెడ్పీ ఉన్నత పా ఠశాల ఆవరణలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్ని భాష లు నేర్చుకున్నా.. తెలుగు మాత్రం మరువొద్దన్నా రు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలని.. పే ద విద్యార్థులు తల్లిదండ్రుల కలలు సాకారం చే యాలని సూచించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల పీ ఎంశ్రీ పథకానికి ఎంపికై ందని.. డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, అన్ని మౌలిక కల్పిస్తారని తెలిపారు. పెద్దలు, తల్లిదండ్రులను గౌరవించాలని, విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో ఉంటూ పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, గురువులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్‌పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, ప్రధానకార్యదర్శి బాల్‌రాంరెడ్డి, రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మి శ్యాంసుందర్‌, హెచ్‌ఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ..

మాగనూర్‌: మండలంలోని నేరెడుగాం శ్రీ సిద్ధలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కల్యాణ మండపం నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి పని చేశారని, ఆయన బాటలో తాను నడుస్తున్నానని తెలిపారు. మంత్రిగా ఈ ప్రాంతానికి సేవలందించానని..ప్రజలందరూ ఆప్యాయత, అనుబంధంతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తానని పేర్కోన్నారు. అంతకుముందు పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతి సిద్ధలింగ మహాస్వామి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణా: మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయం సమీపంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే షెడ్‌కు బుధవారం ఎంపీ డీకే అరుణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీజేపీ నాయకులతో పాటు బ్రాహ్మణ సమాజం ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి షెడ్‌కు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అమర్‌కుమార్‌దీక్షిత్‌, నారాయణభట్‌, కిష్టప్ప, శంక్రప్ప, నర్సప్ప, సురేష్‌, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement