సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల (దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు) ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కాగా.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై గత నెల నుంచే జల్లెడ మొదలుపెట్టింది. అభ్యర్థిత్వం ఖరారుపై ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుదించి మొత్తంగా ముగ్గురి పేర్లను అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. త్వరలో ఒక్క అభ్యర్థిని ఫైనల్ చేసి.. ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


