రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు
ఇల్లు గడవడం కష్టమవుతోంది..
ధరలు భయపెట్టిస్తున్నాయి
రూ.3 వేల వరకు అదనం..
–8లో u
మరికల్: రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్న, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రతి నెల బడ్జెట్ లెక్కలు మారుతున్న తీరు బడుగు జీవులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు వినోదాలు, విహార యాత్రలను వాయిదా వేసుకుంటూ ఉన్నంతలో సర్దుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
● జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. పేద, మధ్యతరగతి కుటుంబాల శాతం ఎక్కువే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువ.. పంట ఉత్పత్తులపై జీవించే వారు అనేకం. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయరంగం ఆశాజనకంగా లేదు. ఆశించిన మేర వానాకాలం సీజన్ లేక చాలామంది బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే క్రమంలో పెరుగుతున్న ధరలు ఒకింత తలనొప్పిగా మారాయి. వివిధ రకాల నిత్యావసర సరుకుల ధరల పెంపుతో అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, ప్రైవేట్ వాహనాల ఛార్జీల పెరుగుదలతో స్పష్టమవుతోంది.
సరుకులు 9 నెలల ప్రస్తుతం
కిందట
బియ్యం 4,500 6,000
మిర్చి పొడి 300 420
వంట నూనె 145 180
కందిపప్పు 120 135
పాలు (లీటర్) 80 84
చక్కెర 44 60
మటన్ (కిలో) 800 900
కోడిగుడ్డు (30) 150 189
వంటగ్యాస్ 923.50 1,012.50
పెట్రోల్ (లీటర్) 107.71 115.94
డీజిల్ (లీటర్) 95.93 104.05
ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు
బతుకు భారమవుతోందని ఆందోళన
నియంత్రణకు ప్రభుత్వం చర్యలు
చేపట్టాలని వినతి
వంట నూనెలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. కొన్నాళ్లుగా పొదుపు మరింత పెరిగింది. కట్టెల పొయ్యి వాడకం పెంచాల్సి వస్తోంది. గతంలో నెలకు రూ.3 వేల వరకు ఖర్చవుతుండగా.. ప్రస్తుతం రూ.4,500 వరకు అవుతోంది. వర్షాలు లేక పంట ఉత్పత్తులు రావడం లేదు. ప్రభుత్వం ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి.
– కుర్మయ్య, ఆటో డ్రైవర్, కన్మనూర్
ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలు భయపెట్టిస్తున్నాయి. ప్రతి నెల ఇంటి సరుకులు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.4 వేలు దాటుతోంది. వర్షాలు లేక వ్యవసాయ కూలి పనులు దొరకడం లేదు. రోజు అడ్డపైకి వచ్చి పనుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకురావడం భారంగా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వలు తగిన చర్యలు తీసుకోవాలి.
– ఎల్లమ్మ, గృహిణి, మరికల్
దాదాపు 9 నెలల వ్యవధిలో నిత్యావసరాల ధరలు 20 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగినట్లు స్పష్టమవుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలు సగటున రూ.2 వేల నుంచి రూ.3 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మాంసం, కూరగాయల ధరల్లోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో పలువురు ఖర్చులు తగ్గించుకునేందుకు దృష్టి సారించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు దినసరి వేతనంపై పని చేసేవారు తర్జన భర్జన పడుతున్నారు.


