అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

మక్తల్‌: నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల ఆస్పత్రి, క్రీడా మైదానం, గొల్లపల్లి సమీపంలో 20 ఎకరాల్లో రూ.250 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, ఫైర్‌స్టేషన్‌ పనులను ఆమె పరిశీలించారు. పట్టణంలో ఆస్పత్రికి సంబంధించి ఏ, బి, సి, డి బ్లాక్‌ పనులు పూర్తయ్యాయని.. గొల్లపల్లి శివారులో ఆర్టిఫిషియల్‌ విభాగానికి 9 ఎకరాలు, సెట్విన్‌కు 10.30 ఎకరా లు, ఏటీసీకి 1.5 ఎకరాలు, సెట్విన్‌ ట్రెనింగ్‌ సెంటర్‌కు 20 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణాలన్ని నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement