రెజ్లింగ్‌లో జిల్లా క్రీడాకారిణులు ప్రతిభ చాటుతుండడం చాలా సంతోషంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించి మరిన్ని పతకాలు సాధించాలి. ధన్వాడలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ నిధులతో దాదాపు రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రెజ్లింగ్ హాల్ నిర్మాణం చివరిదశలో ఉంది.
– శెట్టి వెంకటేశ్,
డీవైఎస్‌ఓ, నారాయణపేట జిల్లా
ధన్వాడ కేజీబీవీలో 8 ఏళ్ల నుంచి రెజ్లింగ్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫున ధన్వాడలో ప్రత్యేక బాలికల రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి. దీని వల్ల బాలికలకు మెరుగైన క్రీడా శిక్షణ లభించడం వల్ల జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దవచ్చు.
– పాత్లోత్ శ్రీనివాస్, రెజ్లింగ్ కోచ్
●


