రాఖీ సందడి | - | Sakshi
Sakshi News home page

రాఖీ సందడి

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

ప్రముఖుల ఇంట

మక్తల్‌/నారాయణపేట/కోస్గి రూరల్‌: ప్రముఖుల ఇంట శుక్రవారం రాఖీ సందడి కనిపించింది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

● నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంట్లో సోదరుడు, టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌రెడ్డికి రాఖీ కట్టారు. తన సోదరుడితో పాటు నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

● నారాయణపేట కాంగ్రెస్‌పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టి శుభాభివందనాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement