చెరువుల్లో నీరేది..?
మండలాల వారీగా వర్షపాతం నమోదు ఇలా.. (జూన్ 1 నుంచి ఆగస్గు 18 వరకు మి.మీ.లలో..)
మూడేళ్లుగా ఇదే పరిస్థితి..
టెండర్ దాఖలు గడువు మరోమారు పొడిగింపు
–8లో u
నారాయణపేట: చేప విత్తనాల సరఫరా టెండర్ ప్రక్రియకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. సాంకేతిక సమస్యలతో పాటు కొన్ని జిల్లాల్లో టెండర్లు అందకపోవడంతో ఈ నెల 20 వరకు గడువు పొడిగిస్తూ మత్స్యశాఖ సంచాలకులు నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. మొదట ఈ నెల 6న టెండర్ల ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేసి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా.. తాజాగా 20న మధ్యాహ్నం 3 వరకు పొడిగించారు. బిడ్లను అదేరోజు మధ్యా హ్నం 3.30 గంటలకు ప్రారంభించనున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 148 మత్స్య సహకార సంఘాలు, 11,039 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో చాలా కుటుంబాలకు చేపల వేటే ప్రధాన జీవనాధారం. వర్షాభావ పరిస్థితులు రైతులతో పాటు మత్స్యకారుల కుటుంబాల ఉపాధిపైనా ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలకు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోతే చేపల పెంపకానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 26 శాతం లోటు వర్షపాతం ఉండటం.. 13 మండలాల్లో 8 మండలాలు లోటు వర్షపాతం నమోదుకావడం మత్స్యకారులకు కూడా ఆందోళన కలిగిస్తోంది.
2024లో టెండర్ల జాప్యం..
2024లో చేప పిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పంపిణీ సకాలంలో చేపట్టలేకపోయారు. సీజన్‌న్ దాటిపోవడంతో జిల్లాలో కేవలం 60 చెరువుల్లోనే చేప పిల్లలను వదిలి ప్రక్రియను ముగించినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సమయానికి చేప పిల్లలు అందకపోవడంతో చెరువులపై ఆధారపడిన మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
2025లో బిల్లుల బకాయి సమస్య..
2025లో పరిస్థితి మరో రూపం దాల్చింది. గతంలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో సరఫరాదారుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు వారు వెనుకడుగు వేశారు. ఫలితంగా ప్రక్రి య మళ్లీ ఆలస్యమైంది. చి వరకు సీజనన్ ముగిసే సమయానికి సుమారు 60 చెరువుల్లో చేప పిల్లలు వదిలి మమ అనిపించారనే విమర్శలు వచ్చాయి.
ఈ ఏడాది రెండుసార్లు పిలుపు..
ఈ ఏడాది చేపపిల్లల సరఫరాకుగాను ఈ నెల 17 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు. కేవలం రెండు దరఖాస్తు మాత్ర మే రావడంతో 20వ తేదీ వరకు గడువు పెంచారు.
మండలం కురిసిన వర్షం సాధారణంలోటు (శాతం)
దామరగిద్ద 214.1 314.2 32 నారాయణపేట 203.1 336.0 40
ఊట్కూర్ 208.0 308.4 33
మాగనూర్ 207.9 291.2 29
కృష్ణా 245.7 278.6 12
మక్తల్ 198.3 264.5 25
నర్వ 195.1 285.1 32
మరికల్ 173.9 302.9 43
ధన్వాడ 183.5 328.1 44
మద్దూరు 266.0 270.1 2
కోస్గి 338.8 347.8 3
గుండుమాల్ 249.2 308.3 19
కొత్తపల్లి 224.2 269.8 17
జిల్లాలో చేప పిల్లల పంపిణీ వ్యవహారం మత్స్యకారులకు ఏటా నిరాశనే మిగులుస్తోంది. వరుసగా మూడేళ్లుగా కారణాలు మారుతున్నా.. చేప పిల్లల పంపిణీలో జాప్యం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. వానాకాలం సీజన్‌న్ ప్రారంభంలోనే చెరువుల్లో చేప పిల్లలు వదలాల్సి ఉండగా.. అధికారిక ప్రక్రియ ఆలస్యం కావడంతో కీలక సమయం గడిచిపోతోంది. చివరికి పంపిణీ జరిగినా.. మత్స్యకారులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది కూడా టెండర్ల జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
● జిల్లాలో 651 చెరువుల్లో 1.87 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. టెండర్లకు మరోసారి అవకాశమిచ్చి ఈ నెల 20 వరకు గడువు పొడిగించినా.. ఇప్పటివరకు రెండు దరఖాస్తులు మాత్రమే రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు కొత్త టెండర్లపై ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో జులైలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. ఆగస్టులోనూ వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో చెరువులు నిండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టెండర్లు పూర్తయినా.. చేప పిల్లలను ఎక్కడ వదలాలి? అన్న ప్రశ్న అధికారులు, మత్స్యకారుల ముందుంది. వర్షాలు ఆలస్యంగా కురిసి చెరువులు నిండే సమయానికి చేప పిల్లలు వదిలితే.. అవి పెరిగే సమయం తగ్గిపోతుంది. దీంతో చేపల పరిమాణం, దిగుబడి తగ్గి మత్స్యకారుల ఆదాయంపైనే ప్రభావం పడే ప్రమాదం ఉంది.
జిల్లాలో ఇప్పటి వరకు వచ్చింది
రెండు దరఖాస్తులే..
బిల్లుల చెల్లింపులు.. టెండర్ల
ఆలస్యంతో కాంట్రాక్టర్ల వెనుకడుగు
ఎదుగుదలపై ప్రభావం
మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన


