అన్నింటికి జనాభా ప్రామాణికం | - | Sakshi
Sakshi News home page

అన్నింటికి జనాభా ప్రామాణికం

Mar 12 2026 8:52 AM | Updated on Mar 12 2026 8:52 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫణిందర్‌రెడ్డి

నారాయణపేట: జనాభా అన్నింటికి ప్రామాణికమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫణిందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 2027 జనగణనపై నిర్వహించిన 3 రోజుల శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పన, ఇతర అంశాలలో జనాభా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. అన్నింటికి ప్రామాణికం జనాభానేనిని, ప్రాంత జనాభాను బట్టి నిధుల కేటాయింపు, అభి వృద్ధి ఆధారపడి ఉంటుందని, జనగణను అందరూ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి జనగణన చేపడుతున్నామని.. ప్రభుత్వ నిబంధనలు, హ్యాండ్‌బుక్స్‌ అన్నింటిని జాగ్రత్తగా చదవాలన్నారు. జనగణన రెండు విభాగాలుగా జరుగుతుందని.. కుటుంబాలు, మనుషుల లెక్కలు సేకరిస్తారని చెప్పారు. 2027 జనగణన డిజిటల్‌ పద్ధతిలో కొనసాగుతుందని.. సరైన సమాచారంతో చేపట్టాలని కోరారు. జనగణనకు అవసరమైన టెక్నికల్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లను నియమించాలని, చురుకై న వ్యక్తులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను మాట్లాడుతూ.. తహసీల్దార్లు, పుర కమిషనర్లు చార్జ్‌ అధికారులుగా ఉన్నందున సరైన వ్యక్తులను సూపర్‌వైజర్లుగా నియమించాలని, ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటారని.. మార్చి 31 నాటికి వీరి నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి 600 నుంచి 700 జనాభాకు ఒక ఎన్యూమరేటర్‌ ఉంటారని వెల్లడించారు. రాష్ట్ర సెన్సెస్‌ కార్యాలయ జాయింట్‌ డైరెక్టర్‌ బి.లాజర్‌ మాట్లాడుతూ.. జనగణనలో సూపర్‌వైజర్‌తో పాటు ఎన్యూమరేటర్లు, చార్జ్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. జనగణనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సూపర్‌వైజర్లు కూడా ఆన్‌లైన్‌లోనే సరి చూసుకోవచ్చని, పోర్టల్‌లో వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు. శిక్షణలో సీపీఓ కాఘవాహన్‌, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, డీపీఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీపీఓ శ్రీదేవి, ఎస్‌ఓ సుల్తాన్‌, విజయ్‌కుమార్‌, పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీఈఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement