డాష్‌బోర్డు వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

డాష్‌బోర్డు వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ

Mar 12 2026 8:52 AM | Updated on Mar 12 2026 8:52 AM

నారాయణపేట రూరల్‌: జిల్లాకేంద్రంలోని గ్రౌండ్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా లో ఎంపిక చేసిన 26 పాఠశాలల నుంచి హాజ రైన 61 మంది ఉపాధ్యాయులకు డాష్‌ బోర్డు వినియోగంపై నిర్వహించిన శిక్షణను సీఎంఓ రాజేంద్రకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలులో భాగంగా ఏఎక్స్‌ఎల్‌ యాప్‌, డాష్‌ బోర్డులను తరగతి గదిలో ఉపయోగించి వి ద్యార్థులకు సులువుగా బోధన అందించవచ్చ న్నారు.విద్యార్థుల అభ్యాసన ప్రగతిని సక్రమంగా నమోదు చేయడం, విశ్లేషించడం, బోధన ను మెరుగుపర్చడంలో డిజిటల్‌ సాధనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన జూన్‌ సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రీసోర్స్‌ పర్సన్లుగా హరిసుధన్‌, నరేష్‌, శంకర్‌, సురేందర్‌, రమ్య, భీమేశ్వరి వ్యవహరించగా డీఎస్‌ఓ భానుప్రకాష్‌, ఏఏంఓ విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అధికారి నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, శశికుమార్‌, పీఆర్టీ యూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎం దత్తురావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement