నారాయణపేట: జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ సూచించినట్లు డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో సోమవారం జరిగిన సంఘటన సృజన్ అభియాన్ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాహుల్‌గాంధీ దిశా నిర్దేశం చేసినట్లు స్థానిక విలేకర్లకు ఫోన్‌లో చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించనట్లు చెప్పారు.


