‘ఎఫ్‌ఎల్‌ఎస్‌’ మాదిరి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ఎల్‌ఎస్‌’ మాదిరి పరీక్ష

Mar 4 2026 8:57 AM | Updated on Mar 4 2026 8:57 AM

జిల్లాలో ఇలా..

నర్వ: ప్రభుత్వ, స్థానిక సంస్థల యూఆర్‌ఎస్‌ పాఠశాలల్లోని మూ డోతరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యాసన సామర్థ్యాల పరిశీలనకు 12, 13వ తేదీల్లో ఫరఖ్‌ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ఫౌండేషన్‌ లర్నింగ్‌ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్‌) పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు విద్యార్థులను సన్న ద్ధం చేసేందుకు మొద ట మూడు మాదిరి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే గత డిసెంబర్‌లో మొదటి, జనవరి చివరి వారంలో రెండో మాదిరి పరీక్ష రాతపూర్వకంగా నిర్వహించారు. మూడో మాదిరి పరీ క్ష మార్చి 2, 4 తేదీల్లో యాప్‌లో నిర్వహిస్తున్నా రు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యా శాఖ అధికారులు జూమ్‌ సమావేశం ద్వారా మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్ర ధాన పరీక్షకు ముందుగా నిర్వ హించే మూడు మాది రి పరీక్షలు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల ను బలోపేతం చేసేందుకు ఎంతో దోహదపడతా యని భావిస్తున్నారు. భాషా సామర్థ్యాల అభివృద్ధిలో భాగంగా బోధనలో మౌఖి క భాష, పఠన అవగాహన, చిత్రాల ఆధారంగా వాక్య నిర్మాణం తదితర 9 ముఖ్య అంశాలు, గణిత సామర్థ్యాల అభివృద్ధిలో 9 అంశాలపై విద్యార్థులతో సాధన చేయిస్తున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ, మేనేజ్‌మెంట్‌, ప్రైమరీ పాఠశాలలు 298, ప్రాథమికోన్నత పాఠశాలలు 85, ఎయిడెడ్‌ పాఠశాలలు 3, ప్రైవేట్‌ పాఠశాలలు 78, మొత్తం 464 పాఠశాలల్లో ప్రతి ఏటా జాతీయ సామర్థ్యాల సాధన (న్యాస్‌) పరీక్షను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈసారి మాత్రం కేవలం మూడో తరగతి విద్యార్థుల భాష, గణిత అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎఫ్‌ఎల్‌ఎస్‌ పరీక్షకు 464 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో 3,549 మంది విద్యార్థులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement