రూ.వెయ్యి కోట్లతో మక్తల్ అభివృద్ధి
మక్తల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే మక్తల్ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని చందాపూర్‌లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మా ణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో మక్తల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా నని అన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం స్థానిక 5వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా.. ఆయ న పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని సూచించారు.
● ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మక్తల్‌లో రూ. 70కోట్లతో ఏ ర్పాటు చేయనున్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పట్టణ సమీపంలోని హైవే లైన్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, ఏఈ నాగశివ, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్‌కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సింహులు, గోవర్ధన్, కట్టా సురేశ్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం, భాస్కర్ పాల్గొన్నారు.


