రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
నారాయణపేట: నూతన సంవత్సరంలో వ్యవసాయ అధికారులు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. తెలంగాణ వ్యవసాయశాఖ అధికారుల సంఘం నారాయణపేట జిల్లా, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ నగేశ్ కుమార్ , అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌గౌడ్, కోశాధికారి హరిత, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిథున్ చక్రవర్తి, జనరల్ సెక్రటరీ రమేష్, కోశాధికారి నవీన్, ఇరు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


