తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో
రూ.64.9 కోట్ల మద్యం విక్రయాలు
మహబూబ్‌నగర్ క్రైం: సాధారణ రోజుల్లోనే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దానికి తోడు పండుగలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 మద్యం దుకాణాల్లో నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే మటన్, చికెన్, నాటుకోడి అమ్మకాలు గణనీయంగా జరిగా యి. ప్రధానంగా నగరంలో శుక్రవారం ఉదయం నుంచే రోడ్లపై ప్రత్యేకంగా తాత్కాలికంగా అడా ్డలు ఏర్పాటు చేసుకుని మటన్, చేపల విక్రయా లు అధికంగా చేశారు. తిమ్మాజిపేట డిపో పరిధి లో రూ.39.9కోట్ల మ ద్యం, కొత్తకోట డిపో నుంచి రూ. 25 కోట్ల వరకు లిఫ్ట్ చేసి దుకాణాలకు తరలించారు.
తెగ తాగేశారు..!
తెగ తాగేశారు..!


