సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
మక్తల్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఎన్నికల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ.. ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కాగా, మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయని, ఇప్పటికే తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ కళాశాల భవనంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటుచేసి.. ఎన్నికల సామగ్రి భద్రపర్చనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
● మక్తల్‌లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసి పూలమొక్క అందజేసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై చర్చించారు.


