నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 15 పరీక్షా కేంద్రాల్లో 5,717 మంది విద్యార్థులకుగాను 4,927 మంది హాజరుకాగా.. 190 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 4,113 మందికిగాను 3,977 మంది హాజరుకాగా.. 136 మంది పరీక్షలు రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 1,004 మందికిగాను 950 మంది పరీక్ష రాయగా.. 54 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి.
విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి..
స్థానిక గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద షీటీం ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్ష ముగిసిన తర్వాత బాలికలతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం షీటీం పని చేస్తుందని, వేధింపులకు గురిచేస్తే సెల్‌నంబర్ 87126 70398 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు కవిత, జ్యోతి, చెన్నప్ప, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


