నేడు డయల్ యువర్ ఎస్పీ
నారాయణపేట: సమస్యల పరిష్కారానికిగాను సోమవారం డ యల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎస్పీ కార్యాలయ నంబర్ 08506281182కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూ చించారు. ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీఆర్‌ఎస్
కోస్గి రూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పుర ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న కోస్గిని 2018లో పురపాలికగా అప్‌గ్రేడ్ చేశామని, రూ.8 కోట్లతో సయ్యద్ పహాడ్ దర్గా నుంచి ఏబీకే ఫంక్షన్‌హాల్ వరకు రహదారి విస్తరణ చేపట్టామని, నాటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి భూత్పూర్–చించోలి డబుల్ రోడ్డు పనులు చేయించామన్నారు. కోస్గిలో కూరగాయల మార్కెట్, పార్కులు ఏర్పాటు చేశామని, తమ హయాంలో 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 30 పడకలకు తగ్గించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కొనుగోలు చేసిన భూముల విలువ పెంచుకోవడానికే ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలను హకీంపేటకు తరలించారని ఆరోపించారు. రేవంత్ అబద్దపు హామీలపై ఇంటింటా ప్రచారం చేపడతామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రైతులే స్వయంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వెంకట్‌నర్సింహులు, జనార్దన్, సాయిలు, బందెప్ప, సాయిలు, ఉసెనప్ప, మధుసూదన్‌రెడ్డి, నీలప్ప, వెంకట్రాములు పాల్గొన్నారు.
‘నారాయణపేటహస్తగతం కావాలి’
నారాయణపేట: పురపాలిక ఎన్నికలపై కాంగ్రెస్‌పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించా రు. ఆదివారం జిల్లాకేంద్రంలో 24 వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో వార్డుల వారీగా అభిప్రాయసేకరణ చేపట్టడంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. ఇప్పటి వరకు 150కిపైగా దరఖాస్తులు అందాయి. స్థానిక పురపాలికను హస్తగతం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులై నడవా లని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కా ర్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్ర యాణం తదితర పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు గెలిచే వారికే టికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఆర్టీఓ సభ్యుడు రాజేశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ సలీం పాల్గొన్నారు.
నేడు డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
నారాయణపేట: డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లాకేంద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మెట్రో ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఏనుముల తిరుపతిరెడ్డి, కుంభం శివకుమార్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్లు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
నేడు డయల్ యువర్ ఎస్పీ
నేడు డయల్ యువర్ ఎస్పీ


