చదువును మించిన ఆయుధం లేదు
కోస్గి: జీవితంలో విజయం సాధించాలంటే చదువును మించిన ఆయుధం ఏదీ లేదని.. శ్రద్ధగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా న్యాయమూర్తి వింద్యానాయక్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ‘రోడ్డు భద్రత, విద్యశ్రీపై నినాదాల తయారీ, పోస్టర్ మేకింగ్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చగా.. శుక్రవారం జిల్లా న్యాయస్థానంలోని తన చాంబర్‌లో విజేతలు నవ్యశ్రీ, మమత, అక్షితకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జనార్దన్, ఉపాధ్యాయుడు వార్ల మల్లేషం తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ టార్చ్ ర్యాలీ
కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు చక్కటి అవకాశమని జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్‌శెట్టి అన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా శుక్రవారం గుండుమాల్ మండల కేంద్రంలో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు పాఠశాల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ మొదలైన క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎం కప్ ఇన్‌చార్జి సాయినాథ్, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, మండల తహసీల్దార్ భాస్కర్‌స్వామి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, మండల విద్యాధికారి శేఖర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీశైల, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఊమెఆస్రా, మండల అధ్యక్షులు విక్రంరెడ్డి తదితరులు ఉన్నారు.
వరి క్వింటా రూ.2,703
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం వరి ధాన్యం (సోన రకం) క్వింటా గరిష్టంగా రూ.2,703, కనిష్టంగా రూ.1,500 ధర పలికింది. అదేవిధంగా తెల్ల కంది గరిష్టంగా 7,659, కనిష్టంగా 5,550, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,625, కనిష్టంగా రూ.5,551 ధరలు లభించాయి.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2809
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,729 ధరలు పలికాయి. అలాగే హంస రూ.1,871, కందులు గరిష్టంగా రూ.6,876, కనిష్టంగా రూ.5,056, వేరుశనగ గరిష్టంగా రూ.8,733, కనిష్టంగా రూ.6,903, ఉలువలు రూ.3,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు రూ.5,720గా ఒకే ధర లభించింది.
పార్టీ బలమున్న
స్థానాల్లో పోటీ : సీపీఎం
వనపర్తి రూరల్: రాబోయే పుర ఎన్నికల్లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బలమున్న స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బాలస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తదితర వర్గాల అభ్యున్నతికి పార్టీ పని చేస్తోందన్నారు. నేటి రాజకీయాలు వ్యాపారంగా మారాయని.. డబ్బు, మద్యం తదితర తాత్కాలిక ప్రయోజనాలను చూయించి ఓట్లు దండుకొంటున్నారని చెప్పారు. అభివృద్ధిని మరిచే రాజకీయాలు నేడు ఉన్నాయని.. నీతి, నిజాయితీతో ప్రజల కోసం పాటు పడుతున్న పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శులు పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్, కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌రెడ్డి, ఎం.రాజు, ఎ.లక్ష్మి, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, సీపీఎం నాయకులు కురుమయ్య, రమేష్, గట్టయ్య, బీసన్న, గంధం మదన్, బాలరాజు, ఉమా, సాయిలీల, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.
చదువును మించిన ఆయుధం లేదు
చదువును మించిన ఆయుధం లేదు


