మక్తల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. ట్యాంకుబండ్‌పై రూ. 3.70 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని.. సుందరీకరణకు నిధుల కొరత లేదని, వేగంగా పూర్తి చేయాలని ఏఈ నాగశివను ఆదేశించారు. చెరువు దగ్గర బోటింగ్, ఈదమ్మ ఆలయం దగ్గర ఘాట్ నిర్మించాలని, వీధిదీపాలు అమర్చాలని సూచించా రు. పర్యాటకులు కూర్చోడానికి కట్టపై సిమెంట్ కు ర్చీలు ఏర్పాటు చేయాలని, కట్టపై కిలోమీటర్ పొడవునా సీసీ రోడ్డు వేయాలని కోరారు. వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఘాట్ నిర్మించాలన్నారు. అదేవిధంగా 16వ వార్డులో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న క్రీడా మైదానం పనులు, రూ.43 కోట్లతో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేశ్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్‌కుమార్‌రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషోద్దీన్, ఎండీ సలాం, కట్టా సురేశ్, భాస్కర్ తదితరులు ఉన్నారు.


