వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు
మక్తల్: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రధానంగా డయాలసిస్ రోగులకు మెరుగైన సేవలు అందించాలని నిమ్స్ నెప్రాలజీ బృందం సూచించింది. గురువారం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్‌ను డాక్టర్లు నిరంజన్, గణేష్, పార్వతి, సౌత్ డీఎస్ అసోషియెటెడ్ మేనేజర్ సిబ్దతుల్లా సందర్శించారు. డయాలసిస్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయని ఆరా తీశారు. రోగులను కలిసి సేవలు ఎలా అందుతున్నాయని, ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని అడిగారు. వైద్యం విషయం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రోగులను వెంటనే నిమ్స్‌కు పంపించాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఎస్‌హెచ్‌ఓ వినూత, తదితరులు పాల్గొన్నారు.


