కందిపోతున్నారు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ని‘బంధనాలు’
దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్‌కు
చెందిన రైతు రాజప్ప తన రెండు ఎకరాల్లో 6 బస్తాల కందులు
పండించారు. వాటిని
విక్రయించేందుకు కోస్గిలో ఏర్పాటుచేసిన కొనుగోలు
కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లగా.. 17 శాతం తేమ వచ్చింది.
దీంతో కందులను ఆరబెట్టుకొని తీసుకురావాలని చెప్పడంతో చేసేదేమి లేక
వెళ్లిపోయారు.
నారాయణపేట మండలం శాసన్‌పల్లికి చెందిన రైతు శ్రీనివాస్ 16 బస్తాల కందులను విక్రయించేందుకు స్థానికంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం తీసుకొచ్చారు. తేమ శాతం ఎక్కువగా ఉందని.. ఆరబెట్టాలని.. జల్లెడ పట్టించాలని చెప్పడంతో అక్కడే కందులను ఆరబెట్టి శుభ్రం చేశారు. అయినా మళ్లీ జిన్నింగ్ మిషన్‌కు వేయాలని చెప్పడంతో ఎన్నో అవస్థలు పడి జిన్నింగ్ మిషన్‌కు కందులను వేయాల్సి వచ్చింది.
ఊట్కూర్‌కు చెందిన రైతు రాము తనకున్న 4 ఎకరాల పొలంలో పండించిన 33 బస్తాల కందులను పేట మార్కెట్ యార్డులో విక్రయించారు. ధర క్వింటాకు రూ. 7,831 వచ్చింది. పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడి రూ. 60వేలు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు వెళ్తే వారు చెప్పే నిబంధనలకు గిట్టుబాటు కాదని ప్రైవేటులో అమ్ముకున్నారు.
●
కందిపోతున్నారు..


