రైతుల సౌకర్యార్థమే కొనుగోలు కేంద్రాలు
కోస్గి రూరల్: పండించిన పంటను విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కోస్గిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నాఫేడ్ ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర రూ. 8వేలకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సాయన్న, పీఏసీఎస్ మాజీ చైర్మన్ భీంరెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, కార్యదర్శి సువర్ణ, కోశాధికారి మంగమ్మ, సీసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


