పురం.. ఉత్కంఠభరితం
నారాయణపేట: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత రిజర్వేషన్లు మారుస్తారా.. లేక పాత వాటిపైనే నిర్వహిస్తారా అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేసి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. తప్పులను సరిచేసి వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి.. 10న పోలింగ్ బూత్‌ల వారీగా తుది జాబితాను ప్రకటించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.
కొత్తగా మద్దూర్..
జిల్లాలో ఇదివరకు నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలు ఉండగా.. కొత్తగా మద్దూర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఈ సారి నాలుగు పురపాలికలకు ఎన్నికలు జరుగుతుండటంతో రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారితే.. ఏ మున్సిపాలిటీ ఏ రిజర్వేషన్ అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మక్తల్ మున్సిపాలిటీ గతంలో బీసీ మహిళగా రిజర్వు అయింది. ఈ సారి జనరల్ లేదా బీసీ జనరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నారాయణపేట, కోస్గి రెండు మున్సిపాలిటీలు దాదాపుగా జనరల్ లేదా జనరల్ మహిళ రిజర్వు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మద్దూర్ విషయానికి వస్తే.. తొలిసారిగా బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ రిజర్వు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయ పరిశీలకుల ఊహాగనాలు మాత్రమే. చేర్పులు, మార్పులు సైతం జరగొచ్చని చెబుతున్నారు.
● 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడు చైర్‌పర్సన్ పదవులను మహిళలే దక్కించుకున్నారు. నారాయణపేటలో బీఆర్‌ఎస్ తరఫున 5వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన గందె అనసూయ (బీసీ మహిళ) చైర్‌పర్సన్ పీఠాన్ని రెండో సారి కై వసం చేసుకున్నారు. ఆమె ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. కోస్గి మున్సిపాలిటీలోనూ బీసీ మహిళకు రిజర్వు కాగా.. 15 వార్డులో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా శిరీష గెలుపొంది చైర్‌పర్సన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మక్తల్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా.. బీజేపీ నుంచి 13వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పావని చైర్‌పర్సన్ అయ్యారు. ఆమె ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.
ఆద్యంతం..ఉత్సాహం
రెండు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన పిల్లలమర్రి బాలోత్సవం నాలుగో పిల్లల జాతర మంగళవారం ముగిసింది.
–8లో u
ముగిసిన రాజకీయ
ప్రతినిధుల సమావేశాలు..
ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 5న జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పుర కమిషనర్లు సమావేశాలు నిర్వహించి.. వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. మంగళవారం జిల్లాస్థాయిలో అడిషనల్ కలెక్టర్ శ్రీను సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
రిజర్వేషన్లపై ఆశావహుల్లో టెన్షన్
2020లో మూడు మున్సిపాలిటీల్లోనూ బీసీ మహిళలే చైర్‌పర్సన్లు
తుది ఓటరు జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం


