సావిత్రిబాయి స్ఫూర్తితో ముందుకు సాగాలి
నారాయణపేట: సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని, వారి స్ఫూర్తితో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మహిళా సాధికారత దిశగా ముందుకు సాగాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్‌లో నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మహిళలు సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి చదువుకోవడంతో పాటు మొదటిసారిగా సమాజంలో మహిళలు చదువుకోడానికి ప్రోత్సహించి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్, డీపీఆర్‌ఓ రషీద్, డీపీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా టీచర్ల సేవలు వెలకట్టలేనివి
నారాయణపేట రూరల్: మహిళా ఉపాధ్యాయుల సేవలు విద్యారంగంలో వెలకట్టలేనివి డీఈఓ గోవిందరాజు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళా టీచర్లకు సన్మానించారు. అనంతంర ఆయన మాట్లాడుతూ.. నిరంతరం కుటుంబ బాధ్యతలను మోస్తూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైనదని అన్నారు. పిల్లల మానసిక ప్రవర్తనను అంచనా వేసి అన్ని రంగాలలో విద్యార్థులను సుశిక్షితులుగా చేయడంలో మహిళా టీచర్లు ముందంజలో ఉన్నారని అన్నారు. అంతకుముందు పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి, నాయకులు వరలక్ష్మి, వాణిశ్రీ, హనీఫ్, జహీరోద్దీన్, రఘువీర్, జనార్దన్, రమేష్, నర్సింహా రెడ్డి, నర్సింగ్ రావు, నరేష్, అరవింద్, భాగ్యరాజు, ప్రసాద్, సాయిలు, వెంకటప్ప, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు కోయిల్‌సాగర్
నీటి విడుదల
దేవరకద్ర: యాసంగి పంటల సాగుకు గాను కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 5 తడులు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో తడి కింద 10 రోజులపాటు నీటిని విడుదల చేసి మధ్యలో విరామం ఇస్తారు. యాసంగి సీజన్‌లో భాగంగా ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తారు. కుడి కాల్వ కింద 8 వేలు, ఎడమ కాల్వ కింద 4 వేల ఎకరాల మేర నీటిని అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి తడి ఆదివారం విడుదల చేస్తారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 32.2 అడుగుల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉన్న రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి.. మరో టీఎంసీని వేసవిలో తాగునీటికి వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,749
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,749, కనిష్టంగా రూ.2,289 ధరలు లభించాయి. అలాగే హంస రూ.1,811, కందులు గరిష్టంగా రూ.6,810, కనిష్టంగా రూ.5,610, వేరుశనగ గరిష్టంగా రూ.8,791, కనిష్టంగా రూ.6,269, మినుములు రూ.7,881, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,856, పత్తి గరిష్టంగా రూ.7,129, కనిష్టంగా రూ.4,500, ఉలువలు రూ.3,900 చొప్పున వచ్చాయి.
● వామ్మో రక్తపింజర
● తల్లి మందలించిందని యువతి ఆత్మహత్యాయత్నం
● రూ.17 లక్షల పత్తి విత్తనాలు చోరీ
– వివరాలు
8లో..


