మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మక్తల్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. మక్తల్, అమరచింత, ఆత్మకూ రు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆయన ఆరోపించారు. వార్డులలో ఓటర్ల జాబితాను పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో మాజి మార్కెట్‌కమిటి చైర్మెన్ నర్సింహగౌడ్, పట్టణ అధ్యక్షులు చిన్నహనుమంతు తదితరులు పాల్గొన్నారు.


