ఘనంగాఆవిర్భావ వేడుకలు
నారాయణపేట: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా సీవీఆర్ భవన్‌లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ యార్డుల్లో ఎమ్మెల్యే జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
● జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ యోగేష్‌గౌతమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాంకేతికంగా దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్‌వన్‌గా ఎదిగిందని ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమకూర్చుకోవడం జరిగిందని అన్నారు.
● నీళ్లు, నిధులు, నియమకాలే లక్ష్యంగా రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్లుగా పోరాడి సాధించుకున్నామని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.


