పోలీసులను అభినందిస్తున్న ఎస్పీ వెంకటేశ్వర్లు
నారాయణపేట రూరల్: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉత్తమ సేవలు అందించి రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు. డీజీపీ నుంచి ప్రశంసలు పొందిన వారిని స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు అభినందించారు. హైదరాబాద్‌లోని మోయినాబాద్ వద్ద జరిగిన క్లోస్ ప్రొటెక్షన్ టీమ్ కోర్సుకు వెళ్లిన ఐదుగురు ప్రతిభ చూపి బెస్ట్ ఫైరర్‌గా ఎంపికయ్యారు. వారిలో కానిస్టేబుళ్లు ఇస్మాయిల్, ఆల్‌రౌండర్‌గా ఎంపికైన మహిళా పోలీసు చరిత, ఊట్కూర్, మద్దూర్ పీఎస్‌ల రిసెప్షనిస్టులు చంద్రకళ, కృష్ణవేణి ప్రశంసా పత్రాలు, క్యాష్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా ఫిబ్రవరికి సంబందించి విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 19మంది కేపీఐ రివార్డులను ఎస్పీ అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐలు నరేందర్, శ్రీనివాస్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.


