నందికొట్కూరు: స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినయ్ హత్య ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసు దర్యాప్తు పురోగతి, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. తొలుత నందికొట్కూరు పట్టణంలోని షికారిపేటలో వినయ్ హత్యకు గురైన ఘటనకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు స్థానిక ప్రజలతో మాట్లాడారు. హత్య కేసులో అందుబాటులో ఉన్న ఆధారాలను శాసీ్త్రయంగా విశ్లేషిస్తూ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారిగా ఉన్న మురళీధర్ రెడ్డిని ఆదేశించారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు.
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
బేతంచెర్ల: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, ఏపీసీ సుధాకర్ రెడ్డి, ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్ వెంకట రామిరెడ్డి అన్నారు. బేతంచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ–1 పరీక్షల నిర్వహణ తీరును బుధవారం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేంచి వారి స్థాయికి అనుగుణంగా బోధన చేపట్టాలన్నారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అబ్రహ్మం, హెచ్‌ఎం హరి కృష్ణ పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానానికి
రూ.4లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ, గోసంరక్షణనిధి, ప్రాణధాన ట్రస్ట్ పథకానికి పలువురు భక్తులు రూ.4లక్షల విరాళాలను అందించారు. బుధవారం హైదరాబాద్‌కు చెందిన కె.ఆర్.సుధాకర్‌రావు అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,001 విరాళాన్ని, గోసంరక్షణనిధి పథకానికి రూ.1,00,001 విరాళాన్ని, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,001విరాళాన్ని అందించారు. అలాగే ఒంగోలుకు చెందిన బి.శ్రీనివాసరావు అన్నప్రసాద వితరణ పథకానికి రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు
బొమ్మలసత్రం: బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఈ నెల 7న నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల గేటు ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన తెలిపారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు నంద్యాల టూ టౌన్ పోలీసులు తెలిపారు.
13న జూడో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 13వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పాఠశాల విద్యార్థులకు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–17 జూడో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు సుధాకర్, శశికళ, లక్ష్మయ్య తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో కేటగిరికి గరిష్టంగా ఇద్దరు క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలన్నారు. ప్రతి క్రీడాకారుడు లీప్‌యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం దరఖాస్తుపై హెచ్‌ఎం సంతకం ఉండాలన్నారు.


