ఎన్నికలు సరే.. సౌకర్యాల డబ్బులు ఏవీ? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సరే.. సౌకర్యాల డబ్బులు ఏవీ?

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

● చేసిన ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని

కోరుతున్న పీఎస్‌లు

జూపాడుబంగ్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈనెల 5న నిర్వహించినా పోలింగ్‌ కేంద్రాల వద్ద గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేని సౌకర్యాలకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. వెంటనే నిధులు ఇవ్వాలని లేదంటే పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేమని కార్యదర్శులు చెబుతున్నారు. జూపాడుబంగ్లా మండలంలో 12 గ్రామ పంచాయతీలుండగా 11 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. తాటిపాడుకు పీఎస్‌ లేకపోవటంతో డిజిటల్‌ అసిస్టెంటుకు పంచాయతీ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఎంపీడీఓ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ.20వేల నుంచి రూ.40వేల దాకా చేతినుంచి డబ్బులు వెచ్చించారు. వాస్తవానికి ప్రభుత్వం ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి రూ.10వేల చొప్పున కేటాయించింది. అందులో రూ.5వేలు అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులకు, రూ.2,500 అధికారుల ఖర్చులకు, ప్రచురణ, ప్రింటింగ్‌ ఖర్చులకు రూ.1,000, వాహనచార్జీలు, ఇందనం కోసం రూ.500 చొప్పున కేటాయించారు. ఈలెక్కన మండలంలోని 32 పోలింగ్‌ కేంద్రాకు రూ.3,20,000 కేటాయించినట్లు సమాచారం. అయితే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పోలింగ్‌ సిబ్బంది భోజనాలు, టీ, టిఫిన్‌కు కేటాయించిన నిధులు మంజూరు చేయలేదు. దీంతో కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఽధికారులు చర్యలు తీసుకొని తాము చేసిన ఖర్చుల మొత్తాన్ని సత్వరమే చెల్లించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల వద్ద చేతినుంచి నగదు వెచ్చించి ఏర్పాట్లు చేయటం కష్టసాధ్యమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement