‘స్థానిక’ ఎన్నికలు అంతా అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలు అంతా అప్రజాస్వామికం

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

● నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

నంద్యాల(న్యూటౌన్‌): చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామికంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిందని సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ఎస్‌డీపీఐ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు సన్నాల సాయిరాంరెడ్డి, రసూల్‌ ఆజాద్‌, ఎజాస్‌, దాసరి చింతలయ్య, పుల్లా నరసింహ, రంగనాయుడు ఆరోపించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్‌ పని చేయలేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రను కోల్పోయి కూటమి రంగు కప్పుకొని పని చేసిందని విమర్శించారు. ఇతర పార్టీల నాయకులను నామినేషన్‌ వేయకుండా దుర్మార్గంగా పోలీసు బలగాలను ఉపయోగించిందన్నారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. ధర్నాలో వామపక్ష పార్టీల నాయకులు లక్ష్మణ్‌, నరసింహనాయక్‌, బాబాఫకృద్దీన్‌, తోటమద్దు, వెంకటలింగం, ధనుంజయుడు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మునెయ్య, సోహేల్‌ రాణా, జాకీర్‌ఉసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement