ఈ ఏడాది రెండు ఎకరాల సొంత పొలంలో ఎకరాకు బస్తా రసాయన ఎరువులు వేసి పది రోజుల క్రితం జేజే–11 రకానికి చెందిన శనగ పంట సాగచేశాను. సేద్యాలు, విత్తనాలు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 8 వేలు వెచ్చించాను. ఒక్క వర్షం కురిసినా చలి, మంచుకు పైరు చేతికంది దిగుబడులు వస్తాయి. మరో వారం రోజుల్లో వర్షం పడకపోతే పైరు ఎండిపోయి నష్టం వాటిల్లుతుంది.
– చెన్నయ్య, రైతు, ఉయ్యాలవాడ
ఈ ఏడాది నాకున్న పది ఎకరాల పొలంలో నాలుగున్న ఎకరాల్లో కంది, ఎకరా విస్తీర్ణంలో వరి పంట సాగు చేశాను. మరో నాలుగున్నర ఎకరాల్లో పప్పుశనగ పంట సాగు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వర్షాలు కురియకపోవడంతో కుందూనదికి మూడు మోటార్లు ఏర్పాటు చేసి పైపులు అమర్చుకుని ఖాళీ పొలానికి నీళ్లు మళ్లిస్తున్నాను. ఎకరా పొలం తడిచేందుకు రోజుకు తొమ్మిది గంటలు నీటిని మళ్లిస్తున్నా దాదాపు ఒకట్నిర రోజు సమయం పడుతోంది. మరో రెండు రోజులు నీటిని మళ్లించి పొలం ఆరిన తర్వాత విత్తనం వేయాల్సి ఉంది.
– రామచంద్రారెడ్డి, రైతు, కోవెలకుంట్ల


