మల్లేశ్వరస్వామికి కిరణాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మల్లేశ్వరస్వామికి కిరణాభిషేకం

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

కొలిమిగుండ్ల: బందార్లపల్లె సమీపంలోని పురాతన నేల బెలుం మల్లేశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కార్తీక మాసంలో నెల రోజుల పాటు భానుడి కిరణాలు స్వామిపై పడుతుంటాయి. ఈ మేరకు బుధవారం ఉదయ భానుడి లేలేత సూర్యకిరణాలు నేరుగా మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, వీరభద్రస్వామి వార్లపై ప్రసరించాయి. స్వామి వారిని సూర్యకిరణాలు తాకిన అపురూప దృశ్యాన్ని భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు. సూర్యభగవానుడే స్వయంగా మల్లేశ్వ రస్వామికి కాంతితో అభిషేకం చేస్తున్నట్లుగా కనిపించింది. ప్రకృతి రమణీయల మధ్యలో వెలసిన మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. కార్తీక మాసం చివరి సోమవారం ఇక్కడ తిరుణాల నిర్వహిస్తారు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో కిరణాలు ఉదయం15 నిమిషాల పాటు పడుతుంటాయని భక్తులు తెలిపారు.

మల్లేశ్వరస్వామి,పార్వతిదేవిపై పడిన కిరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement